Vijay Deverakonda : హాయ్ నాన్న ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..

హాయ్ నాన్న చిత్ర ద‌ర్శ‌కుడు శౌర్యువ్ డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda ) ఓ చిత్రంలో న‌టించ‌నున్నారు.

Official Vijay Deverakonda movie with hi nanna fame Shouryuv

Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న రౌడీ జ‌నార్థ‌న, ర‌ణ‌బాలీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ లుక్ అదిరిపోయింది. రెండు చేతుల‌లో గొలుసుల‌తో క‌ట్టేసిన నాలుగు కుక్క‌ల‌ను తీసుకుని వెలుతున్నాడు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Nayanthara : కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా.. న‌య‌న‌తార ఆనందాన్ని చూశారా?

 

వాస్తవానికి హాయ్ నాన్న తర్వాత దర్శకుడు శౌర్యువ్ జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. ఇక ఇదే క‌థ‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చెప్ప‌గా ఓకే చేసిన‌ట్లు టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు అఫీషియ‌ల్‌గా శౌర్యువ్‌, విజ‌య్ క‌లిసి ఓ సినిమా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే.. ఇది ఎన్టీఆర్‌తో చేయాల్సిన క‌థ‌నేనా? లేక మ‌రో క‌థ‌నా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Tollywood : టాలీవుడ్‌కు రూ.3వేల కోట్లు లాస్..?