Sravana Bhargavi: “ఈ పాటలో అశ్లీలం కనిపిస్తోంది.. శ్రావణ భార్గవి తప్పు తెలుసుకోవాలి”
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కకున్నారు. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించి.. మైమరపించిన తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తనలు అవమానించారని ఆయన వంశస్థులు శ్రావణ భార్గవి పాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
- Subhan Ali Shaik
- Published On : July 20, 2022 / 02:56 PM IST
Shravana Bhargavi
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కకున్నారు. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించి.. మైమరపించిన తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తనలు అవమానించారని ఆయన వంశస్థులు శ్రావణ భార్గవి పాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అన్నమయ్య వంశస్థులు తాళ్ళపాక హరినారాయణాచార్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల పాడిన వీడియో సాంగ్‌లో కనిపించిన సింగర్ పట్ల అసహనం ప్రదర్శించారు. అన్నమయ్య కీర్తన విషయంలో గాయని శ్రావణి భార్గవి వ్యవహారం సమంజసంగా లేదని తిట్టిపోశారు.
”ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాట స్వామి అమ్మవార్లకు చెందినది. గాయని శ్రావణి భార్గవి ఈ పాటను తనకు ఆపాదించుకొని చిత్రీకరణ చేశారు. కాళ్లు చూపిస్తూ సాగిన ఈ పాటలో చిత్రీకరణ అశ్లీలం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో లైక్‌ల కోసం కీర్తనలను ఇష్టారాజ్యాంగ మార్చడం సరికాదు. ఇదే విధంగా వదిలేస్తే రేపు మరొకరు మరింత వివాదాస్పద రీతిలో స్వామి కీర్తనలను మార్చవచ్చు”
Read Also: సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??
“అన్నమయ్య కీర్తనలు స్వామి అమ్మవార్ల గురించి ఆలపించినవే తప్ప, సినిమా పాటలు కాదు. ఇకనైనా శ్రావణ భార్గవి తప్పు తెలుసుకుని ఆ పాటను తొలగించాలి. దీనిపై త్వరలోనే టీటీడీ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నాం. అవసరమైతే తాళ్లపాక వంశీయుల తరపు నుంచి దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తాం” అని తాళ్ళపాక హరినారాయణాచార్యులు పేర్కొన్నారు.
