Site icon 10TV Telugu

KRAMP : K-ర్యాంప్ నుంచి ‘ఓన‌మ్’ పాట వ‌చ్చేసింది.. అదిరిపోయే స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన‌ కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా..

Onam Song Lyrical Video from KRAMP movie

Onam Song Lyrical Video from KRAMP movie

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ” K-ర్యాంప్”. యుక్తి తరేజా క‌థానాయిక‌. జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ‘ఓనమ్’ లిరికల్ సాంగ్ విడుద‌ల చేసింది. ఈ పాట‌కు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించ‌గా సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్.

Mahesh Babu : పవన్ లాగే మహేష్.. SSMB29 పోస్టర్.. మహేష్ మెడలో ఉన్న లాకెట్ ఏంటి..? శివుడి బ్యాక్ డ్రాప్ లో..

‘ ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట‌లో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా డాన్స్ ఇర‌గ‌దీశారు.

Exit mobile version