Toxic : య‌శ్ ‘టాక్సిక్’ మ‌ళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

య‌శ్ న‌టిస్తున్న‌ టాక్సిక్ (Toxic) మూవీ విడుద‌ల మ‌రోసారి వాయిదా ప‌డింది.

Once again Yash Toxic movie postpone

  • య‌శ్ న‌టిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌
  • జూన్ 4 న విడుద‌ల కావాల్సి ఉండ‌గా మ‌రోసారి వాయిదా
  • వాస్తవానికి మార్చి 19న విడుద‌ల కావాల్సింది

Toxic : కేజీఎఫ్ 2 చిత్రం త‌రువాత య‌శ్‌ న‌టిస్తున్న మూవీ టాక్సిక్‌. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రుక్మిణి వ‌సంత్‌, న‌య‌న‌తార‌, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతారియా క‌థానాయిక‌లు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా వారికి భారీ షాక్ త‌గిలింది. మ‌రోసారి ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది.

జూన్ 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌ని మూవీ యూనిట్ తెలిపింది. విడుద‌లకు మూవీ సిద్ధంగా ఉంద‌ని, అయితే.. అంత‌ర్జాతీయ డిస్ట్రిబ్యూష‌న్, భాగ‌స్వామ్యాలు జ‌ర‌గుతున్న కార‌ణంగా విడుద‌ల తేదీని మారుస్తున్నామ‌ని తెలిపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఒకే తేదిన విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నామ‌ని, అది ఏ రోజు అన్న‌ది అతి త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Mahesh Babu : వారణాసికి బ్రేక్.! నెక్స్ట్ ప్రాజెక్టుపై మ‌హేశ్‌ ఫోకస్.?

ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకునేలా కాస్త టైమ్ తీసుకుని, అత్యుత్త‌మ ఔట్‌పుట్ అందించాల‌ని అనుకుంటున్న‌ట్లు య‌శ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు. వాస్త‌వానికి తొలుత ఈ చిత్రం మార్చి 19న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల జూన్ 4కు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది.