RRR for Oscars : ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ ఇవాళే.. ‘RRR’ స్థానం దక్కించుకుంటుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ ముల్టీస్టార్రర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈరోజు జ్యూరీ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ అనౌన్స్ చేయనుంది. ఈ లిస్ట్‌లో RRR ఉంటుందా?

RRR for Oscars : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ ముల్టీస్టార్రర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారతీయ సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రపంచ సినీ వేదికలో కూడా మంచి ప్రజాధారణ సంపాదించుకుంది. అంతేకాదు అంతర్జాతీయ పురస్కారాల్లో కూడా అవార్డులను అందుకుంటూ హాలీవుడ్ చిత్రాలకి పోటీగా నిలిచింది. అయితే ఎన్ని అవార్డులు అందుకున్న RRR గురి అంతా ఆస్కార్ ని గెలుచుకోవడమే.

RRR : ఫిలీ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ జోరు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇండియన్ మూవీగా భారతదేశ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ RRR ని కాకుండా ఆస్కార్‌కి గుజరాతీ మూవీ ‘ది లాస్ట్ మూవీ షో’ని నామినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే జనరల్ ఎంట్రీ ద్వారా నామినేషన్స్ నిలవడానికి రాజమౌళి బృందం.. గత కొన్ని రోజులుగా ఆస్కార్ కాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఆ రోజు ఇవాళ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇవాళ(డిసెంబర్ 21) చాలా ముఖ్యమైన రోజు. నేడు జ్యూరీ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ అనౌన్స్ చేయనుంది. ప్రతి క్యాటగిరీ నుంచి మొత్తం 15 షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత 2023 జనవరి 24న, షార్ట్ లిస్ట్ చేసిన 15 నుంచి మళ్ళీ ప్రతి క్యాటగిరీలో 5 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్ విన్నెర్స్ ని 2023 మార్చి 12న ప్రకటించనున్నారు. మరి ఈ లిస్ట్ లో RRR స్థానం దక్కించుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు