Chandrayaan 3 : కొన్నిరోజులు నుంచి భారతీయులు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 విజయం నిజం అయ్యింది. చంద్రుడు పై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ హిస్టరీలో నిలిచింది. ఇక చంద్రుడు పై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించగా అంతకుముందు అమెరికా, రష్యా, చైనా చంద్రుడు పై ల్యాండ్ అయ్యాయి. ఇటీవల చంద్రుడిపై రష్యా ప్రయోగించిన Luna 25 ఫెయిల్ అవ్వడంతో ప్రపంచ దేశాల దృష్టి అంతా చంద్రయాన్ పై పడింది.
Urvashi Rautela : ఆ గౌరవం అందుకున్న తొలి నటిగా ఊర్వశి రౌతేలా.. రిషబ్ పంత్ పేరుతో..
దీంతో ఈ అరుదైన ఘట్టాన్ని మొత్తం ప్రపంచమంతా వీక్షించింది. ఇక మిషన్ సక్సెస్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈక్రమంలోనే పాకిస్తాన్ (Pakistan) కి చెందిన ఒక నటి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రముఖ పాకిస్తానీ నటి సెహర్ షిన్వారీ (Sehar Shinwari) తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది.. “భారత్ తో శత్రుత్వం పక్కన బెడితే, చంద్రయాన్-3 ద్వారా ISRO సృష్టించిన చరిత్రని తప్పక అభినందించాల్సిందే. ఇండియా అందుకున్న స్థాయిని పాకిస్తాన్ అందుకోవడానికి దాదాపు రెండు మూడు దశాబ్దాలు పడుతుంది. దురదృష్టవశాత్తు ఆ దుస్థితి మనమే తెచ్చుకున్నాము” అంటూ పోస్ట్ చేసింది.
Samantha : ఒంటరిగా జీవించడం అరుదైన బహుమతి.. అవకాశం వస్తే వదులుకోకండి.. సమంత పోస్ట్ వైరల్..!
Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.…
— Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023
ఇక ఈ ట్వీట్ చూసిన ఇండియన్ నెటిజెన్స్ లైక్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఇటీవల ప్రకాష్ రాజ్ (Prakash Raj) చంద్రయాన్-3 పై చేసిన ఒక ట్వీట్ భారతీయులు చాలామందికి ఆగ్రహం వచ్చేలా చేసింది. తాజాగా ప్రకాష్ రాజ్ ఇస్రోని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ అనేక మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking
— Prakash Raj (@prakashraaj) August 23, 2023