Patas Praveen : తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో షేర్ చేసిన భార్య..

తాజాగా ప్రవీణ్ తండ్రి కాబోతున్నాడు. (Patas Praveen)

  • Published on- August 31, 2026 / 07:03 PM IST

Patas Praveen

Patas Praveen : జబర్దస్త్, పటాస్ షోలతో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్న ప్రవీణ్ ఇటీవల మేలో ఇరు కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ఈ జంట సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా ప్రవీణ్ తండ్రి కాబోతున్నాడు. కడెం వంశిత తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also See : Serial Actor Sireesha : సీరియల్ నటి శిరీష వెడ్డింగ్ రిసెప్షన్.. కొడుకుతో ఫొటోలు..

ఈ వీడియోలో.. తాను తల్లి కాబోతున్నట్టు ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ ని ప్రవీణ్ కి చూపించింది. దీంతో ప్రవీణ్ ఆనందంతో ఆమెని హత్తుకొని ముద్దులు పెట్టాడు. ఆమె తల్లికి కూడా ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె కూడా ఆనందంతో వంశితను హత్తుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా పలువురు నెటిజన్లు, టీవీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.