Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం
రమేష్ బాబు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. పవన్ కళ్యాణ్ కూడా రమేష్ బాబు మృతిపై సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
- Saketh U
- Published On : January 9, 2022 / 06:45 AM IST
Pawan Kalyan
Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నిన్న రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. నిన్న ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. పవన్ కళ్యాణ్ కూడా రమేష్ బాబు మృతిపై సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
Rowdy Boys: లవ్, రొమాన్స్, కాలేజ్ ఫైట్స్.. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్!
”నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్ర్బాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రముఖ నటులు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలో వచ్చి మంచి విజయాలు సాధించారు. సోదరుడు శ్రీ మహేష్ బాబుతో అర్జున్ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ గారు పుత్ర శోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనో స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రమేష్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
