Pawan Kalyan – Sai Dharam Tej : కలెక్షన్స్ సునామీ సృష్టించడానికి డేట్ ఫిక్స్ చేసిన మామ అల్లుడు..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి 'వినోదయ సిత్తం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
- gum 95921
- Published On : March 24, 2023 / 04:44 PM IST
Pawan Kalyan and Sai Dharam Tej movie release date announce
Pawan Kalyan – Sai Dharam Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న మూవీ ‘వినోదయ సిత్తం’ (Vinodhaya Sitham) రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే స్టార్ అయ్యిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. తెలుగులో కూడా అతనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు. పవన్ రోల్ సినిమాలో సాగ భాగం మాత్రమే ఉంటుంది. ఈ నెలాఖరుతో పవన్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ మొదలయ్యేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన పవన్?
తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ ని ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇంకా తెలియజేయలేదు. త్వరలో దాని పై అప్డేట్ రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో పవన్, సాయి ధరమ్ కాకుండా ఇంకెవరు నటిస్తున్నారు అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Virupaksha: ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విరూపాక్ష
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే గతంలో పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా తరహాలోనే ఈ మూవీ కూడా ఉండబోతుంది. సాయి ధరమ్ తేజ్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కి గురయ్యి ప్రాణం కోలుపోతాడు. అప్పుడు అతని దగ్గరికి టైం అనే వ్యక్తి (పవన్ కళ్యాణ్) వచ్చి భూమి పై నీ సమయం అయ్యిపోయింది అని, తనతో రావాలని చెబుతాడు. అయితే సాయి ధరమ్ తాను చేయవల్సిన కొన్ని పనులు ఉన్నాయి అని, తనకి ఒక మూడు నెలలు సమయం కావాలని పవన్ ని అడుగుతాడు. ఆ సమయాన్ని పవన్ ఇవ్వడమే కాకుండా, ఆ 3 నెలలు సాయి ధరమ్ తో కలిసి ప్రయాణిస్తాడు. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ.
#PKSDT storming in theatres from 2️⃣8️⃣th July 2023?
Bombarding updates on the way?@PawanKalyan @IamSaiDharamTej@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/HpuF8i34xf
— People Media Factory (@peoplemediafcy) March 24, 2023
