Pawan Kalyan : OG 2 అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్.. విదేశాల నుంచి రాగానే..

తాజాగా పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ట్విట్టర్ లో OG 2 పై ఆసక్తికర ట్వీట్ చేసింది. (Pawan Kalyan)

  • Published on- June 11, 2026 / 08:51 PM IST

OG 2

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే స్టైలిష్ గ్యాంగ్ స్టర్ అవతారంలో మొదటిసారి కనిపించి 300 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం సాధించారు. ఈ సినిమాకు అధికారికంగానే పవన్, దర్శకుడు సుజీత్ పార్ట్ 2 కూడా ప్రకటించారు. దీంతో పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

పవన్ మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవ్వడం, సుజీత్ నానితో సినిమా ప్రకటించడంతో OG 2 సినిమా ఇప్పుడు ఉండకపోవచ్చు అని అనుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ట్విట్టర్ లో OG 2 పై ఆసక్తికర ట్వీట్ చేసింది.

Also Read : Makutam Teaser : విశాల్ ‘మకుటం’ టీజర్ వచ్చేసింది.. మూడు వేరియేషన్స్‌తో అదరగొట్టాడుగా..

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ లో.. మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు. సమయం ఎప్పుడనేది ఆయన మనకు తెలియజేస్తారు. సుజీత్ విదేశాల నుండి తిరిగి వచ్చాక మనం దీని గురించి చర్చిద్దాం అని పోస్ట్ చేశారు. దీంతో పవన్ కచ్చితంగా OG 2 చేస్తారు, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజీత్ రాగానే ఎప్పుడు చేయాలో చర్చిస్తామని ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో ఉత్సహం నెలకొంది. సుజీత్ నాని సినిమా అయినా వెంటనే OG 2 ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.

OG సినిమాలో పవన్ జపాన్ నుంచి వచ్చి ముంబై లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదగడం, మధ్యలో కొన్నేళ్లు కనిపించకపోవడం చూపించిన సంగతి తెలిసిందే. సినిమా చివర్లో జపాన్ లో OG పెద్ద గ్యాంగ్ స్టర్ అని పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. సుజీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, OG పై రిలీజ్ చేసిన పుస్తకం ఆధారంగా OG 2 ప్రీక్వెల్ గా ఉండనుంది.

Also Read : Isakapatnam : ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ కొత్త సిరీస్‌.. ఇసాక‌ప‌ట్నం ఎప్పుడో తెలుసా?

సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళినప్పుడు కొంతమంది ఇండియన్ ఆర్మీ కూడా తీసుకెళ్లాడు. వాళ్ళల్లో ఒకరు అక్కడ సమురాయ్ లకు సపోర్ట్ చేసి చనిపోతారు. అతని కొడుకు ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్). అతను తన తండ్రిని చంపిన శత్రువులను చంపడానికి ముంబై నుంచి జపాన్ కి తిరిగొచ్చి జపాన్ లో పెద్ద గ్యాంగ్ స్టార్ అయి అక్కడ యుజికిలందర్నీ చంపేయడం, తండ్రి కొడుకుల కథగా ఉండబోతుందని భావిస్తున్నారు.