Harish Shankar : కేంద్రమంత్రిని కలిసిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయం ఏంటంటూ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ లో ఉన్న సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
- gum 95921
- Published On : June 26, 2023 / 08:18 PM IST
Pawan Kalyan director Harish Shankar meets central minister Nitin Gadkari
Harish Shankar : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పొలిటికల్ టూర్ వల్ల ఈ మూవీ షూటింగ్ కొంచెం బ్రేక్ పడింది. వారాహి యాత్ర మొదలయ్యే ముందు హరీష్ శంకర్.. మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా వెళ్లి పవన్ పొలిటికల్ టూర్ సక్సెస్ కావాలని తన ఆకాంక్షని కూడా తెలియజేశాడు.
Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వల్ల ఇక కుదరలేదు
ఇక తాజా ఈ దర్శకుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. “ఇండియన్ హైవేస్ నిర్మించడంలో ఎంతో పేరు పొందిన విషనరీ లీడర్, ఎప్పుడు ఒదిగి ఉండే శ్రీ నితిన్ గడ్కరి గారిని కలుసుకోవడం, కొంతసేపు సమయం గడపడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ఆయనని ఎందుకు కలిశాడు అన్న విషయం మాత్రం చెప్పలేదు. దీంతో విషయం ఏంటని పవన్ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ లో ఉన్న సమయంలో ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Humbled to meet the modern architect of Indian Highways, the visionary leader who is always down to earth, Shri @nitin_gadkari ji.
It’s a pleasure to have spent time with you sir. pic.twitter.com/4THlxdrlou— Harish Shankar .S (@harish2you) June 26, 2023
కాగా పవన్ వారాహి యాత్ర పూర్తి అవ్వగానే OG సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడని తెలుస్తుంది. మరి ఉస్తాద్ ని ఎప్పుడు మొదలు పెడతాడు అనే దాని పై ఎటువంటి సమాచారం లేదు. అయితే తదుపరి షెడ్యూల్ కోసం మాత్రం హైదరాబాద్ లో భారీ సెట్ ని మాత్రం నిర్మించారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
