Pawan- Charan: రామ్ చరణ్‌కు అదే శ్రీరామరక్ష.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్
రామ్ చరణ్ కు బర్త్ డే విషెష్ తెలియజేసిన పవన్ కళ్యాణ్(Pawan- Charan).
- V Santhosh Kumar
- Published On : March 27, 2026 / 11:28 AM IST
Pawan Kalyan extended birthday wishes to Ram Charan via social media.
Pawan- Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ పవన్ రాసిన సందేశం అభిమానుల మనసు గెలుచుకుంది. నటన పట్ల అంకితభావం కలిగిన రామ్ చరణ్, ప్రతి సినిమా కోసం పడే తపనను పవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే.. కొడుకుతో స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసిన మెగాస్టార్
వృత్తి పరంగానే కాకుండా, వ్యక్తిగత విలువల్లోనూ చరణ్ ఆదర్శంగా నిలుస్తారని పవన్(Pawan- Charan) పేర్కొన్నారు. కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత, పెద్దల పట్ల గౌరవం, తోటి నటులు, సాంకేతిక నిపుణుల పట్ల ఆయన చూపించే మర్యాద చరణ్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయని కొనియాడారు. ముఖ్యంగా చరణ్‌లోని ఆధ్యాత్మిక చింతన, దైవ భక్తి ఆయనకు ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా నిలుస్తాయని పవన్ ఆకాంక్షించారు. చరణ్ మరెన్నో విజయాలు సాధించాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ తన శుభాకాంక్షలను ముగించారు. బాబాయ్ అబ్బాయిల మధ్య ఉన్న ఈ అనుబంధం చూసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.
హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్!
ప్రముఖ యువ కథానాయకుడు @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటన పట్ల అంకిత భావం కలిగిన రామ్ చరణ్ ప్రతి చిత్రాన్ని తపనతో చేస్తారు. కుటుంబ బంధాలకు విలువనిస్తూ పెద్దల పట్ల గౌరవం కనబరుస్తూ, సహచర నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, రచయితలతో…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2026
