Thaman : ఒరిజినల్ సినిమాలో అసలు పాటలే లేవు.. కానీ ‘బ్రో’ సినిమాలో.. బ్రో పాటలకు తమన్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

ఒరిజినల్ మూవీలో సాంగ్స్ లేకపోయినా ఈ సినిమాలో సాంగ్స్ పెట్టి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేద్దామనుకున్నారు మేకర్స్. ఏకంగా నాలుగు పాటలు ఉన్నాయని చెప్పారు.

Pawan Kalyan fans Trolling Thaman for BRO Movie Music

Thaman :  పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాటలు హైలెట్ కావాలి. రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయ్యి జనాల నోళ్లలో నానాలి. కానీ సీన్ రివర్స్ అవుతోంది. అసలే బజ్ లేదని, పాటలతో అయినా ట్రాక్ లో పడుతుందని అనుకుంటే ఉన్నది కూడా పోయేలా కనిపిస్తోందంటున్నారు. అట్టహాసంగా సాంగ్ కోసం ఈవెంట్ ప్లాన్ చేసి మరీ రిలీజ్ చేసిన సాంగ్ సినిమాకి ఏ మాత్రం ప్లస్ అయ్యేలా కనిపించడం లేదని, తమన్ డిజప్పాయింట్ చేశాడని తెగ తిడుతున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్స్ లో సముద్రఖని డైరెక్షన్లో తమన్ మ్యూజిక్ ఇస్తున్న బ్రో మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఒరిజినల్ మూవీలో సాంగ్స్ లేకపోయినా ఈ సినిమాలో సాంగ్స్ పెట్టి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేద్దామనుకున్నారు మేకర్స్. ఏకంగా నాలుగు పాటలు ఉన్నాయని చెప్పారు. పాటలు బాగుంటే సినిమా మీద బజ్ వస్తుంది అనుకుంటే తమన్ ఇచ్చిన ట్యూన్స్ విసుగు తెప్పిస్తున్నాయని, పవర్ స్టార్ సినిమాకి ఇలాంటి నాసిరకం పాటలిస్తారా అంటూ సోషల్ మీడియాలో తమన్ ని మరోసారి తెగ ట్రోల్ చేస్తున్నారు.

బ్రో మూవీ నుంచి జాణవులే సాంగ్ రిలీజ్ అయ్యింది. అంతకుముందే మార్కండేయ కూడా రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మధ్య ఇంట్రస్టింగ్ గా వచ్చే సాంగ్ కూడా అంతగా ఎట్రాక్ట్ చెయ్యలేకపోయాడు తమన్. వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ ‘బ్రో’కి ఇంత డిజాస్టర్ మ్యూజిక్ ఇవ్వడంతో అభిమానులు విమర్శలు చేస్తున్నారు. పవన్ సినిమాని గ్రాంటెడ్ గా తీసుకున్నాడని, అందుకే పెద్దగా పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన ట్యూన్లిచ్చి జనాల మొహాన పడేశాడని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు తమన్ ని.

Project K : ప్రాజెక్ట్ K సినిమాకు హాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్..

ఇక బ్రో సినిమా జులై 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు టైం ఉన్నా అస్సలు సినిమాపై ఎలాంటి హైప్ లేదు. ప్రమోషన్స్ కూడా సరిగ్గా చెయ్యట్లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహ పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు