Pawan Kalyan : మళ్ళీ ఆ ధైర్యం ఇచ్చింది ఈ సినిమా.. ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్..

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. (Pawan Kalyan)

  • Published On : March 15, 2026 / 10:59 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు అన్నం పెట్టింది సినిమా, నాకు ప్రజలకు సేవ చేసే ఛాన్స్ వచ్చింది కూడా సినిమా వల్లే. నిర్మాతలు బాగుండాలి అందుకే. నేను కలెక్షన్స్ గురించి అడగను. సినిమా బాగుండాలి. నాకు తెలుగు, తమిళ్, హిందీ సినిమా అనుకోను. నేను భారతీయ సినిమా అనుకుంటాను. నేడు తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. ఇలాంటి పరిశ్రమలో నేను ఒక భాగం అయినందుకు ఆనందంగా ఉంది. నా దర్శకులు, రైటర్లు రాసింది, చెప్పింది నేను ఎంత బాగా చేయాలి అనుకుంటాను. కానీ ఫలితాలు మన చేతిలో ఉండవు. నా వరకు నాకు ఉన్న హీరో ఒకరే చిరంజీవి. చిరంజీవి గారిని ఫంక్షన్ కి పిలవండి అన్నాడు హరీష్ శంకర్. కానీ ఆయన్ని పిలిస్తే తమ్ముడిలా సైలెంట్ అయిపోతాను. చిరంజీవి, పెద్ది రామ్ చరణ్ ఉస్తాద్ ట్రైలర్ చూసి ట్వీట్స్ వేయడం ఆనందంగా ఉంది. సినిమా మొదలయ్యేటప్పుడు బాగుండాలి, బాగా రావాలి, త్వరగా రావాలి అనుకుంటాం. కానీ మొదలయ్యాక అనుకోని అడ్డంకులు వస్తాయి. చాలా ఒడిదొడుకులు తట్టుకుంటాము. వాటన్నిటిని తట్టుకొని సినిమా తీయడం చాలా కష్టం. సినిమా మాకు ఫుడ్ ఇచ్చేది. అందుకే ఏ హీరో కూడా ఎవరి సినిమా కూడా పోవాలి అనుకోరు.

Also Read : Pawan Kalyan : ఆయన చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టాను.. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ వ్యాఖ్యలు..

గబ్బర్ సింగ్ తర్వాత మేము మళ్ళీ చేయలేకపోయాను. నేను డైరెక్టర్ ని ఒక్కసారి నమ్మాను అంటే బ్లైండ్ గా వాళ్లు ఏం చెప్తే అది చేస్తాను. కరోనా, పాలిటిక్స్.. ఇలా వీటన్నిటి మధ్య సినిమా లేట్ అయింది. నాకు ఉన్న బాధ్యతలకు ఇబ్బంది కలగకుండా ఈ సినిమా ఎలా షూట్ చేయాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాం. 40 రోజుల్లో ప్లాన్ చేసి రోజూ ఉదయం, సాయంత్రం టైం ఇచ్చి షూటింగ్ చేశాను. నేను బిజీగా ఉన్నా సినిమాలు చేయొచ్చు అని భరోసా ఇచ్చింది, ఆ ధైర్యం ఇచ్చింది ఈ సినిమా. నా చేత డ్యాన్స్ కూడా చేయించారు ఈ సినిమాలో. దేవిశ్రీ ప్రసాద్ సినిమాల్లోకి రాకముందు ఆయన మొదటి ప్రైవేట్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేశాను. అలా దేవితో అప్పట్నుంచి కొనసాగిస్తున్నాను. ఈ సినిమాకు మంచి ఊపు ఉన్న సాంగ్స్ ఇచ్చారు. నిర్మాత నవీన్ గారు నా గబ్బర్ సింగ్ తో నే డిస్ట్రిబుట్యూటర్ గా మారారు. ఆయన ఎప్పట్నుంచో నాతో సినిమా చేయాలి అని అడుగుతున్నారు. ఇన్నాళ్లకు కుదిరింది. ఈ సినిమా రావడానికి ఒక్కడే కారణం హరీష్ శంకర్. నాకు హార్స్ రైడింగ్ తెలీదు కానీ గబ్బర్ సింగ్ లో గుర్రం సవారి చేసే సీన్ పెట్టాడు. హరీష్ శంకర్ కి అనవసరమైన గొడవలకు, కాంట్రవర్సీలకు వెళ్లొద్దు అని చెప్తా. ఏదన్నా అంటే కౌంటర్ ఇచ్చేస్తాడు. ఏదో ఒకరోజు తెలంగాణ కోసం పనిచేస్తాడు. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గబ్బర్ సింగ్ లాంటి విజయం సాధించాలి ఈ సినిమా మీ కోసం. కానీ ఫలితం మీ చేతుల్లోనే ఉంది. తప్పులేకుండా మేమంతా కస్టపడి సినిమా చేసాము. నేను పాలిటిక్స్ లో ఉన్నా నా గుండెల్లోంచి సినిమాని తీయలేరు. సినిమా లేకపోతే క్రైమ్ పెరిగిపోతుంది. బెంగుళూరులో వీరప్పన్ కన్నడ హీరోని కిడ్నప్ చేసినప్పుడు కొన్ని రోజులు సినిమాలు ఆగిపోతే అక్కడ క్రైమ్ రేట్ పెరిగిపోయింది అని పోలీసులు చెప్పారు.

Also See : Sreeleela : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో శ్రీలీల మెరుపులు..

అందరి హీరోల సినిమాలు బాగుండాలి. టికెట్ పెంచడం పై మాట్లాడతారు. సినిమా కంపల్సరీ కాదు గన్ పెట్టి చూడమని చెప్పం కదా. నా సినిమాలకు తక్కువ రేట్లు ఇచ్చుకొని వేరే హీరోలకు ఎక్కువ రేటు ఇచ్చాను. టికెట్ పెంచిన దానిపై 18 శాతం GST గవర్నమెంట్ కి వస్తుంది. వదిలేస్తే బ్లాక్ లో టికెట్ అమ్ముకుంటారు. ఆ డబ్బులు ఎటు పోతాయో తెలీదు. అందుకే అన్ని ఆలోచించి హీరో ఎవరు అనేది సంబంధం లేకుండా ఏ హీరో సినిమా వచ్చినా, కన్నడ కాంతారా సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచాను. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు చింపినా సినిమా బాగుండాలని కాంతార సినిమాకు పర్మిషన్ ఇచ్చారు. సినిమా బాగుండాలి. ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాను. ఆన్లైన్ లో అది కరెక్ట్ వాతావరణం కాదు. నేను ఒక హీరోగా చెప్తున్నా అందరి హీరోల అభిమానులను గౌరవిస్తాను. ఏ హీరోతో విబేధాలు లేవు నాకు. అందరు హీరోలు హిట్స్ కొట్టాలి. నేను చాలా సార్లు చెప్పాను ఇది. ఒక హీరోగా నిర్మాతలు బాగుండాలి.

Pawan Kalyan

భీమ్లా నాయక్ సినిమాకు మీరంతా నిలబడ్డారు. మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. మీకు నాకు రెండు గుండెలు దూరం అంతే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. దేశం, సామాజిక బాధ్యత వంటి అంశాలతో పాటు కమర్షియల్ అంశాలతో ఉండాలి. ఈ సినిమా ఇలాగే ఉంటుంది. పాలిటిక్స్ లోకి వెళ్ళాక సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. నేనంటే పడని వాళ్ళు, నా గురించి నా సినిమాల గురించి మాట్లాడతారు. వాళ్లందరికీ వేరే వ్యాపారాలు ఉన్నాయి. కానీ నాకు సినిమాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ నా దగ్గరికి ఎవరైనా సినిమా చేయాలని వస్తే హరీష్, మైత్రి టీమ్ దగ్గరకు పంపిస్తాను. తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసారో, నా కాలాన్ని కరెక్ట్ గా ఎలా వాడుకున్నారో వీళ్ళని అడిగి తెలుసుకోవాలి. సినిమాలో ఇచ్చిపడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని ఉంది కానీ నేను మిమ్మెల్ని ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం అని చెప్తాను అని అన్నారు..