Viral Pic
Viral Pic: తెలుగు సినీ ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా క్లారిటీ లేదు. లేటెస్ట్‌గా విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం సినిమా అక్టోబరు 13నే రిలీజ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈరోజు(29 జూన్ 2021) ఉదయం నుంచి బైక్‌పై రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వెళ్తున్న పిక్ వైరల్ అవుతుండగా.. సాయంత్రానికి అదే బైక్‌పై మరో స్టార్ హీరో ఉన్న పిక్ వైరల్ అవుతోంది.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటోలు వైరల్ అవడం కామనే అయితే, ఆర్ఆర్ఆర్ బైక్‌పై పవన్ కళ్యాణ్ ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు అభిమానులు. ట్రెండ్ సెట్టర్ అంటూ పవన్ కళ్యాణ్ అదే బైక్‌పై ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. రెండు భాషలకు సంబంధించి రామ్ చరణ్-ఎన్టీఆర్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ముగిస్తారని చెబుతున్నారు.
Ramaraju & Bheem ❤️?? #RRRMovie pic.twitter.com/5vrM662iGo
— RRR Movie (@RRRMovie) June 29, 2021
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖనితో పాటుగా పలువురు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈసినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Trending Pic ?
.@PawanKalyan ?❤️ pic.twitter.com/80VKm7szpC— Admire PSPK ™ (@AdmirePSPK) June 29, 2021
Same bike ? @PawanKalyan#Jalsa #RRRMovie pic.twitter.com/xCnpyvdeoR
— PAWANIFIED-PSPK (@PAWANIFIED_PSPK) June 29, 2021
Trend setter Usthad #PawanKalyan???#PSPK28 @PawanKalyan pic.twitter.com/pZhOLiiNyh
— Mani Roy #WithPK (@ManiPSPKFan) June 29, 2021