Pawan Kalyan : అరుణాచలం గిరి ప్రదక్షణపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?
ఇటీవల పవన్ కళ్యాణ్ అరుణాచలం గిరిప్రదక్షణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అయ్యాక కుదిరినప్పుడల్లా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ అరుణాచలం గిరిప్రదక్షణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ గురించి జరిగిన ఓ మీటింగ్ లో పవన్ ఈ వ్యాఖ్యలు చేసారు.
Also Read : Vijay – Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి డీటెయిల్స్ లీక్ చేయొద్దు.. విజ్ఞప్తి చేసిన టీమ్..
పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న నాయకులు, అధికారులతో మాట్లాడుతూ.. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు. నేను వినటమే తప్ప ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరికగా ఉంది. ఆ అనుభూతిని పొందాలని నాకు కూడా ఉంది అని అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మరి పవన్ అరుణాచలం గిరి ప్రదక్షణ ఎప్పుడూ చేస్తారు అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
