Vijay – Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి డీటెయిల్స్ లీక్ చేయొద్దు.. విజ్ఞప్తి చేసిన టీమ్..
రష్మిక - విజయ్ పెళ్లి, రిసెప్షన్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు అంటూ వారి టీమ్ ఓ ప్రకటన చేసింది.(Vijay - Rashmika)
Vijay Rashmika
Vijay – Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఫిబ్రవరి 26న రాజస్థాన్ లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో మార్చ్ 4న గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రష్మిక – విజయ్ పెళ్లి కార్డు కూడా వైరల్ అయింది.
అయితే ఆ పెళ్లి కార్డులో ఉన్న రిసెప్షన్ వేదిక డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా వైరల్ అవ్వడంతో చాలా మంది సోషల్ మీడియాలో ఈ డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు. దీంతో ఇలా రష్మిక – విజయ్ పెళ్లి, రిసెప్షన్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు అంటూ వారి టీమ్ ఓ ప్రకటన చేసింది.
Also Read : Nikhil Maliyakkal : హీరోగా బిగ్ బాస్ నిఖిల్.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో.. టీజర్ చూశారా..?
విజయ్ – రష్మిక టీమ్.. పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన వివరాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విజయ్ – రశ్మిక పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇలా ఆ వేడుక వివరాలన్నీ వెల్లడి చేయడం కరెక్ట్ కాదు. పెళ్ళికి రానున్న అతిధుల కోసం వేదిక వద్ద కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ కార్డులో ప్రింట్ చేయడంతో పలువురు దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు.
వెడ్డింగ్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. అతిధుల ప్రైవసీకి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి పూర్తిగా వ్యక్తిగత విషయం. అలాంటి పర్సనల్ ఈవెంట్ కు సంబంధించి పోస్ట్ లు చేసే ముందు ఆ పోస్ట్ ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది తెలుసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేసారు.
Also See : Nayan Sarika : చీరకట్టులో క్యూట్ గా నయన్ సారిక.. విష్ణు విన్యాసం ఈవెంట్లో మెరుపులు..
