Janasena Peddi : ఇటు జనసేన మీటింగ్ అటు పెద్ది ఈవెంట్.. ఒకేసారి బాబాయ్ అబ్బాయి..
ఒకటి జనసేన పవన్ కళ్యాణ్ సభ అయితే ఇంకోటి రామ్ చరణ్ పెద్ది ఈవెంట్. (Janasena Peddi)
- Saketh U
- Updated on- June 2, 2026 / 11:36 AM IST
Janasena Peddi
Janasena Peddi : నేడు జూన్ 2న హైదరాబాద్ లో ఒకేసారి రెండు భారీ ఈవెంట్స్ జరగనున్నాయి. మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఈ ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటి జనసేన పవన్ కళ్యాణ్ సభ అయితే ఇంకోటి రామ్ చరణ్ పెద్ది ఈవెంట్.
పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుండగా నిన్న జూన్ 1న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేడు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హోటల్ లో మధ్యాహ్నం 4 గంటల నుంచి ఈ సినిమా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ కి మూవీ యూనిట్ అంతా హాజరు కాబోతున్నారు.
Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’కి పోటీ వస్తున్న మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే..
అయితే ఇదే రోజు అటు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. నేడు జూన్ 2న గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభను జనసేన ప్లాన్ చేసింది. అయితే ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ చర్చగా మారింది. సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
జనసేన పార్టీ నేతలతో కలిసి ఈ మీడియా సమావేశం నిర్వహిస్తానని, ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అయినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా చూద్దాం అంటూ ట్వీట్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు సాయంత్రం ప్రెస్‌మీట్‌లో పవన్ ఏం మాట్లాడతారా అని అంత ఎదురుచూస్తున్నారు.
ఇలా ఒకే రోజు ఆల్మోస్ట్ ఒకే సమయానికి అటు పవన్ కళ్యాణ్ జనసేన ప్రెస్ మీట్, ఇటు రామ్ చరణ్ పెద్ది ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటంతో చర్చగా మారింది. మెగా ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ రెండు ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండటంతో చరణ్ తన పెద్ది ప్రెస్ మీట్ ని వాయిదా వేసుకుంటాడని తెలుస్తుంది.
