Pawan Kalyan : తన డైరెక్టర్స్‌తో పవర్ స్టార్.. వైరల్ అవుతున్న ఫొటో..
తాజాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల డైరెక్టర్స్ తో దిగిన ఫొటో మరింత వైరల్ అవుతుంది. ఇటీవల 'భీమ్లా నాయక్' స్పెషల్ షో వేయగా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్స్ అంతా కలిశారు......
- Saketh U
- Published On : March 2, 2022 / 08:29 AM IST
Pawan Kalyan
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. పవన్ తర్వాతి సినిమాలు కూడా వరుసగా లైన్ లో ఉన్నాయి. ఇటీవల తన రాబోయే చిత్రాల డైరెక్టర్స్ హరీష్ శంకర్, క్రిష్ తో కలిసి ‘భీమ్లా నాయక్’ సెట్ లో ఫొటో దిగారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
తాజాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల డైరెక్టర్స్ తో దిగిన ఫొటో మరింత వైరల్ అవుతుంది. ఇటీవల ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో వేయగా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్స్ అంతా కలిశారు. ఇందులో పవన్ తనతో ‘వకీల్ సాబ్’ చేసిన వేణు శ్రీరామ్, త్రివిక్రమ్, ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కే చంద్ర, హరీష్ శంకర్, క్రిష్ ఉన్నారు. ఇలా ఒకే ఫ్రేమ్ లో అయిదుగురు డైరెక్టర్స్ తో ఫొటో దిగడంతో ఇది మరింత వైరల్ అవుతుంది.
Naga Chaitanya : విక్రమ్ దర్శకత్వంలో ‘దూత’గా భయపెట్టనున్న నాగచైతన్య
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దశలో ఉంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా త్వరలో షూట్ కి వెళ్లనుంది. అయిదుగురు డైరెక్టర్స్ తో పవన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో పవన్ అభిమానులు ఆనందిస్తున్నారు. రాబోయే పవన్ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
