Bro Trailer : బ్రో ట్రైల‌ర్ ఆగ‌యా.. మామా అల్లుడు కుమ్మేసారుగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’(Bro). త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని( Samuthirakani) ఈ సినిమాకి డైరెక్ట‌ర్‌.

Bro Trailer

Bro Trailer out : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రో’(Bro). త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని( Samuthirakani) ఈ సినిమాకి డైరెక్ట‌ర్‌. సోషియో ఫాంటసీ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన వినోద‌య సిత్తం(Vinodhaya Sitham)కి రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు.

Kanguva : ‘అత‌డి చూపులు క‌త్తి క‌న్నా ప‌దును.. రాజు వ‌చ్చేస్తున్నాడు..’ అర్థ‌రాత్రి సూర్య ఫ్యాన్స్‌కు ప‌ని ప‌డింది

ప‌వ‌న్ ఈ సినిమాలో దేవుడ‌గా క‌నిపించ‌నున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి జోడిగా కేతిక శ‌ర్మ క‌నిపించ‌నుండ‌గా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ చెల్లి పాత్ర‌లో న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

Devara : దేవ‌రకు త‌ల‌నొప్పిగా మారిన ఫ్యాన్స్‌.. చిత్ర బృందం కీల‌క నిర్ణ‌యం..!

ఈ క్ర‌మంలో నేడు ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. త‌రువాత సాయి ధరమ్ తేజ్ ను పరిచయం చేశారు. అతని ప్రియురాలిగా కేతికా శర్మ క‌నిపిస్తుంది. ఇక ప్రతిదానికీ తనకు టైమ్ లేదని అంటుంటాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. టైమ్ లేద‌ని చెప్పే హీరోకి టైమ్ ఎదురైతే ఏమైందనేది క‌థ‌గా తెలుస్తోంది.

ప‌వ‌న్ చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. ప‌వన్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల‌ను ఒకే సారి చూడ‌డం మెగా ఫ్యాన్స్‌కు పండ‌గే అని చెప్ప‌వ‌చ్చు. ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. విడుద‌ల అయ్యేంత వ‌ర‌కు కూడా ఆగ‌లేమ‌ని అంటున్నారు అభిమానులు.

Vijai Bulganin : ‘బేబీ’ హిట్ అవుతుంద‌ని ఫ‌స్ట్‌ నుంచి నమ్మాను.. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్

 

ట్రెండింగ్ వార్తలు