×
Ad

Pawan Kalyan : మరో కొత్త సినిమా ఓకే చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవడం ఖాయం.. నిర్మాత కూడా సెట్టు..

తాజాగా మరో సినిమాని కూడా పవన్ ఓకే చేసినట్టు టాలీవుడ్ టాక్. (Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నా తనకు ఆదాయం ఇచ్చేది సినిమా ఒకటే అని అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. త్వరలో మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. ఒకవేళ పవన్ హీరోగా చేసినా చేయకపోయినా నిర్మాతగా సినిమాలు తీస్తానని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రకటించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలిపారు.(Pawan Kalyan)

అసలే నష్టాల్లో, వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ నిర్మాతగా సినిమాలు చేయడానికి చేతులు కలపడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ పవన్ కి టిజి విశ్వప్రసాద్ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడని తెలుసు కాబట్టి ఓకే అనుకున్నారు. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read : Priyanka Chopra : 3 నెలలు హాస్పిటల్‌లో.. ఆరు సార్లు రక్త మార్పిడి.. పాపం ప్రియాంక చోప్రా కూతురు.. నిక్ జోనస్ ఎమోషనల్..

తాజాగా మరో సినిమాని కూడా పవన్ ఓకే చేసినట్టు టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ గతంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బ్రో సినిమా చేసారు. ఆ సినిమా బాగున్నా కమర్షియల్ గా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మరో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చాడట. ఆ సినిమాకు మొదట వంశీ పైడిపల్లి దర్శకుడు అనుకున్నారు కానీ చివరికి మెహర్ రమేష్ ని ఫైనల్ చేశారట. మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై మెహర్ రమేష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓకే అయిందని తెలుస్తుంది.

దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మెహర్ రమేష్ కెరీర్ లో బిల్లా తప్ప మరో హిట్ లేదు. మెహర్ రమేష్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తారని తెలిసిందే. గతంలో మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికైనా పవన్ తో సినిమా చేస్తానని అన్నాడు. ఇప్పుడు ఆ మాట నిజం కానుంది. మెహర్ రమేష్ కి పవన్ తో ఎప్పుడో కెరీర్ ఆరంభం నుంచి అనుబంధం ఉంది. మరి మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో అయినా హిట్ కొడతాడా చూడాలి. మెహర్ ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే ఈ సినిమాని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ అయితే మెహర్ డైరెక్షన్ లో సినిమా అంటే భయపడుతున్నారు.

Also See : Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..