Pawan Kalyan Farm House : ఫామ్ హౌస్ సీక్రెట్స్ బయట పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ కి ఒక ఫామ్ హౌస్ 8 ఎకరాల్లో పొలం ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించి చాలా సార్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి పవన్ వ్యవసాయం చేస్తాడు, ప్రకృతిని ఆస్వాదిస్తాడు అని చెప్పారు. తాజాగా ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో పవన్ మరోసారి................

Pawan Kalyan Farm House :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

Pawan Kalyan : సిగ్గుతో చచ్చిపోయా.. వదినకి కాల్ చేసి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పాను..

పవన్ కళ్యాణ్ కి ఒక ఫామ్ హౌస్ 8 ఎకరాల్లో పొలం ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించి చాలా సార్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖాళీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి పవన్ వ్యవసాయం చేస్తాడు, ప్రకృతిని ఆస్వాదిస్తాడు అని చెప్పారు. తాజాగా ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో పవన్ మరోసారి తన ఫామ్ హౌస్ గురించి మాట్లాడారు. బాలయ్య పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో పని చేస్తున్న ఫొటోని స్క్రీన్ మీద వేయగా పవన్ కళ్యాణ్ దీని గురించి చెప్పాడు. ఖుషి సినిమా తర్వాత ఒక 8 ఎకరాల పొలం కొన్నాను. అక్కడే ఓ ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయాల వల్ల కుదరట్లేదు టైం దానికి. అక్కడే ఒక గోశాల ఉంది. అందులో 30 ఆవుల దాకా పెంచుకుంటాను, వాటి పాలు పితకము కానీ అలా ఉంటాయి. ఖుషి సినిమా తర్వాత ఇంకో అయిదు సినిమాలు చేసి ఆపేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత వ్యవసాయం చేద్దాం అనుకోని ఈ పొలం కొన్నాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు