Akira Nandan : నాన్న గెలుపుపై సోషల్ మీడియాలో పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్.. ఏం పెట్టాడంటే..

ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ నాన్న గెలుపు పై తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసాడు.

Akira Nandan : నాన్న గెలుపుపై సోషల్ మీడియాలో పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్.. ఏం పెట్టాడంటే..

Pawan Kalyan Son Akira Nandan Shares a Post about his Father Victory

Akira Nandan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో జనసేన, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. ఇక జనసేన పార్టీ పోటీ చేసిన అసెంబ్లీ 21 స్థానాల్లోనూ, లోక్ సభ రెండు స్థానాల్లోనూ గెలిచింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి దాదాపు 70 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు.

పవన్ గెలుపుతో సినీ పరిశ్రమ, మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ నాన్న గెలుపు పై తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసాడు.

Also Read : Pawan Kalyan Mother : పవన్ గెలుపుపై తల్లి అంజనమ్మ వీడియో.. ఇకపై గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అంటూ..

అకిరా నందన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో ఎవరికీ తెలీదు. అకిరా చాలా పర్సనల్ గా తన సోషల్ మీడియా అకౌంట్ వాడుతున్నాడు. అయితే అకిరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసి.. సెల్యూట్ ది కెప్టెన్ అని పోస్ట్ చేసాడు. దాన్ని స్క్రీన్ షాట్ చేసి రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే అకిరా అకౌంట్ ఏంటో ఆ పేరు కనపడకుండా జాగ్రత్త పడింది. అకిరా తన నాన్న గెలుపు పై పోస్ట్ చేసాడు అంటూ తెలిపింది రేణు దేశాయ్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి అకిరా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో అని పవన్ అభిమానులు వెతికేస్తున్నారు.

Pawan Kalyan Son Akira Nandan Shares a Post about his Father Victory