Pawan Kalyan Mother : పవన్ గెలుపుపై తల్లి అంజనమ్మ వీడియో.. ఇకపై గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అంటూ..
పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

Pawan Kalyan Mother Anjana Devi Special Video on Pawan Kalyan Janasena Victory
Pawan Kalyan Mother : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో జనసేన, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎంపీ సీట్స్ లో కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలిచింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి దాదాపు 70 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు.
పవన్ విజయంపై సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెతుతున్నాయి. పవన్ ఫ్యామిలీ కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు, కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్. అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ సోదరీమణులు.. ఇలా మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Also Read : Renu Desai : పిఠాపురంలో పవన్ గెలుపు.. మాజీ భార్య రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అని తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.