Renu Desai : పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపు.. మాజీ భార్య రేణూ దేశాయ్ పోస్ట్ వైర‌ల్‌

పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘ‌న విజ‌యం సాధించారు.

Renu Desai : పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపు.. మాజీ భార్య రేణూ దేశాయ్ పోస్ట్ వైర‌ల్‌

Renu Desai Post On Pawan Kalyan victory In Ap Elections 2024

Updated On : June 4, 2024 / 5:27 PM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘ‌న విజ‌యం సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయ‌న ముఖ్య పాత్ర పోషించారు. ఓటు షేర్ అయ్యేలా పని చేసి రాష్ట్రంలో కూట‌మి అధికారంలోకి రావ‌డంలో కీల‌క పాత్రను పోషించారు.

ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుండ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అభినందిస్తూ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులతో పాటు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాజీ భార్య రేణూ దేశాయ్ సైతం స్పందించారు. కూతురు ఆద్య టీ గ్లాస్ పట్టుకున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ గెలుపుతో ఆద్య అండ్ అకిరా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు కూడా ఈ విజ‌యంతో ల‌బ్ది పొందుతార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు రాసుకొచ్చారు.

Chiranjeevi – Pawan Kalyan : పవన్ గెలుపుపై మెగాస్టార్ ట్వీట్.. డియర్ కళ్యాణ్ బాబు అంటూ ఎమోషనల్ గా..

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి వంగా గీత‌పై 69,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో జ‌న‌సైనికుల సంబ‌రాలు మిన్నంటాయి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)