Chiranjeevi – Pawan Kalyan : పవన్ గెలుపుపై మెగాస్టార్ ట్వీట్.. డియర్ కళ్యాణ్ బాబు అంటూ ఎమోషనల్ గా..
తాజాగా పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Megastar Chiranjeevi Emotional Tweet on Power Star Pawan kalyan
Chiranjeevi – Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. పదేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి భారీ విజయం సాధించారు. జనసేన కూడా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతుంది. దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన, పవన్ కళ్యాణ్ గెలవడంతో పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan Wife : పవన్ గెలుపు.. వీర తిలకం పెట్టి హారతి ఇచ్చిన భార్య.. పక్కనే తనయుడు అకిరా..
తాజాగా పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్ లో.. డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
దీంతో చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది. తమ్ముడి కోసం అన్నయ్య చేసిన ట్వీట్ కి జనసేన కార్యకర్తలు, అభిమానులు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ తెగ షేర్ చేస్తున్నారు.