Pawan Kalyan Wife : పవన్ గెలుపు.. వీర తిలకం పెట్టి హారతి ఇచ్చిన భార్య.. పక్కనే తనయుడు అకిరా..

పవన్ గెలవడంతో భార్య అన్నా లేజనోవా పవన్ కళ్యాణ్ కి వీర తిలకం పెట్టి హారతి ఇచ్చింది.

Pawan Kalyan Wife : పవన్ గెలుపు.. వీర తిలకం పెట్టి హారతి ఇచ్చిన భార్య.. పక్కనే తనయుడు అకిరా..

Pawan Kalyan Wife Anna Lezhneva gives veera tilak and arathi to Pawan

Updated On : June 4, 2024 / 4:04 PM IST

Pawan Kalyan Wife : ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read : Pawan Kalyan – Raviteja : పవన్ గెలుపు.. రవితేజ సినిమా షూటింగ్‌లో సంబరాలు..

పవన్ గెలుపుతో హైదరాబాద్ లోని పవన్ నివాసం బయట అభిమానులు, కార్యకర్తలకు వచ్చి సెలబ్రేషన్స్ చేశారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పవన్, పవన్ భార్య అన్నా లేజనోవా, తనయుడు అకిరా నందన్ అభివాదం చేశారు. అనంతరం పవన్ గెలవడంతో భార్య అన్నా లేజనోవా పవన్ కళ్యాణ్ కి వీర తిలకం పెట్టి హారతి ఇచ్చింది. పక్కనే అకిరా నందన్ కూడా ఉన్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.