Pawan Kalyan – Raviteja : పవన్ గెలుపు.. రవితేజ సినిమా షూటింగ్‌లో సంబరాలు..
పవన్ గెలుపుతో సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Raviteja Movie Mr Bachchan Unit Celebrates Pawan Kalyan Victory in Movie Set
Pawan Kalyan – Raviteja : ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని సీట్లు గెలుచుకుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read : Pawan Kalyan Wife : పవన్ గెలుపుతో ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ భార్య, తనయుడు అకిరా..
పవన్ గెలుపుతో సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోలు, సినీ ప్రముఖులు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లో మూవీ యూనిట్ టపాసులు కాల్చి, డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Team #MrBachchan celebrated the landslide victory of @PawanKalyan Garu ?
Congratulations on the sensational win, sir ❤?#MassReunion pic.twitter.com/KWHTblfJ61
— ??????????? (@UrsVamsiShekar) June 4, 2024