Pawan Kalyan Wife : పవన్ గెలుపుతో ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ భార్య, తనయుడు అకిరా..
పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

PawanKalyan wife Anna Lezhneva and son Akira Nandan says thanks to Fans and Janasena Members and Participated in Celebrations
Pawan Kalyan Wife : ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read : Pawan Kalyan : ఏపీ ఎన్నికల ఫలితాల వేళ.. పవన్ OG నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎవ్వరికి అందదు అతని రేంజ్..
హైదరాబాద్ లోని పవన్ నివాసం బయట అభిమానులు, కార్యకర్తలకు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తుండటంతో పవన్ భార్య అన్నా లేజనోవా, తనయుడు అకిరా నందన్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
#PawanKalyan wife Anna Lezhneva and son Akira Nandan acknowledges the crowd at their residence in Hyderabad. pic.twitter.com/TEu0L01wfA
— Gulte (@GulteOfficial) June 4, 2024