×
Ad

Pawan Kalyan – OG : పవన్ కోసం విజయవాడలో ముంబై సెట్..? OG సినిమా కోసం..

OG సినిమా ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయింది. పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే మొత్తం షూట్ అయిపోతుందని సమాచారం.

  • Published On : August 27, 2024 / 03:50 PM IST

Pawan Kalyan They Call Him OG Movie Updates Mumbai Sets in Vijayawada

Pawan Kalyan – OG : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగా బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాల బిజీ వల్ల తన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా ఎలాగైనా ఆ సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తానని పవన్ తెలిపాడు. అన్నిటికంటే ముందు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమా షూట్ కి డేట్స్ ఇస్తారని తెలుస్తుంది.

OG సినిమా ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయింది. పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే మొత్తం షూట్ అయిపోతుందని సమాచారం. OG సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే గ్యాంగ్ స్టర్ కథ అని తెలిసిందే. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ముంబైకి వచ్చి షూట్ చేసేంత ఖాళీ లేకపోవడంతో పవన్ కోసం ముంబైని విజయవాడకు తీసుకొస్తున్నారట.

Also Read : Raj Tarun : నన్ను ఆ వివాదంలోకి మళ్ళీ లాగొద్దు.. రియల్ లైఫ్‌లో పెళ్లి పై రాజ్ తరుణ్ కామెంట్స్..

విజయవాడలో ముంబై సెట్స్ వేసి OG సినిమా షూటింగ్ చేస్తారట. ఇండోర్ సెట్స్ విజయవాడలో వేసి, అవుట్ డోర్ మాత్రం ముంబైలోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ లో OG సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారని, వారానికి రెండు రోజులు డేట్స్ ఇవ్వనున్నారని, దీనికి తగ్గట్టు సుజీత్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇదే నిజమైతే పవన్ OG సినిమా త్వరలోనే వస్తుంది. ఫ్యాన్స్ అయితే పవన్ OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.