×
Ad

Pawan Kalyan : వదిన దగ్గర కూడా అప్పు తీసుకున్న పవన్.. ఎలక్షన్ అఫిడవిట్‌లో వివరాలు..

ఇటీవలే చిరంజీవి నుంచి ఐదు కోట్లు డొనేషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. వదిన సురేఖ దగ్గర కూడా అప్పు తీసుకున్నారట.

  • Published On : April 23, 2024 / 04:18 PM IST

Pawan Kalyan took a loan from Chiranjeevi wife Surekha Konidala

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పవన్ కూడా తన పొలిటికల్ కాంపెయిన్ విషయంలో వేగం పెంచి ముందుకు కదులుతున్నారు. ఇక ఈ కాంపెయిన్ కోసం భారీ ఖర్చు అవుతుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఖర్చులు కోసం పవన్ కళ్యాణ్.. తన కుటుంబం మరియు పలువురు నిర్మాతల నుంచి అప్పుగా కొంత డబ్బుని తీసుకున్నారు.

ఆ విషయాన్ని నేడు దాఖలు చేసిన తన నామినేషన్ పత్రంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నామినేషన్ తో పాటు తన ఆస్థుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ ని కూడా నామినేషన్ పత్రంలో పవన్ పొందిపరిచారు. ఆ అఫిడవిట్ లో పవన్ తన వదిన, చిరంజీవి భార్య సురేఖ దగ్గర కూడా అప్పు చేసినట్లు పేర్కొన్నారు. సురేఖ కొణిదెల దగ్గర నుంచి 2 కోట్లు లోన్ గా తీసుకున్నట్లు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Also read : Prabhas : ప్రభాస్ కొత్త ఫోటో చూశారా.. ఏమున్నాడురా బాబు..

అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరికొందరు నుంచి కూడా పవన్ లోన్ గా కొంత అమౌంట్ ని తీసుకున్నారు. ఈ అమౌంట్ ని సినిమా అడ్వాన్స్ గా పరిగణించి, ఆ బ్యానర్స్ లో పవన్ మూవీ చేయనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇటీవల చిరంజీవి నుంచి కూడా ఐదు కోట్లు డబ్బుని పార్టీ ఖర్చులు కోసం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కొడుకు రామ్ చరణ్ ని కూడా పవన్ కి డొనేట్ చేయాలంటూ చిరంజీవి కోరారు. ఇప్పుడు భార్య సురేఖ కూడా పవన్ కి డబ్బుని ఇవ్వడం విశేషం.

ఇక ఇది అఫిడవిట్ లో పవన్ తనకి ఉన్న వాహనాలు వివరాలను కూడా తెలియజేసారు. మొత్తం తొమ్మిది లగ్జరీ కార్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. అలాగే ఒక కాస్టలీ బైక్ అండ్ వ్యాన్ ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఈ అఫిడవిట్ లో వారాహి పేరుని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ అఫిడవిట్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.