Pawan Kalyan : సూపర్‌స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చారు.. పవన్ కళ్యాణ్!
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదానికి గురయ్యింది. కృష్ణ గారి అకాల మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించగా, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు.
- gum 95921
- Published On : November 15, 2022 / 11:27 AM IST
Pawan Kalyan tweet on super star krishna death
Pawan Kalyan : సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదానికి గురయ్యింది. కృష్ణ గారి అకాల మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించగా, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు.
“చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్ధకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం నాకు ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను, కానీ ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
తెలుగు సినీ రంగ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు తన స్వగ్రామం బుర్రిపాలెంపై ఎంతో ప్రేమాభిమానాలు చూపేవారు. బుర్రిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు కృష్ణ గారు అండగా నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాలు, ప్రజా జీవితంలో కొద్ది కాలమే ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా తన ముద్రను వేశారు. శ్రీ కృష్ణ గారి కుమారుడు శ్రీ మహేశ్ బాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.
