Pawan Kalyan : ఉస్తాద్, OG షూటింగ్ అప్డేట్స్.. వారాహి యాత్ర తరువాత ఆగష్టులో..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాల గురించి కొన్ని రోజులుగా నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా..
- gum 95921
- Published On : August 3, 2023 / 08:47 PM IST
Pawan Kalyan Ustaad Bhagat Singh OG movie Updates
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో బ్రో (Bro) మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక తరువాతి వరసలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. OG మూవీ 50 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకొని బ్యాలన్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉంది. ఉస్తాద్ విషయానికి వస్తే.. ఇప్పటికి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో 10 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.
Baby Movie : భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ అత్యుత్సాహం.. మీడియా పై బౌన్సర్లతో దాడి..
దీంతో పవన్ తన తదుపరి కాల్ షీట్స్ ఉస్తాద్ కి ఇవ్వబోతున్నాడని కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. ఆగష్టు లాస్ట్ వీక్ నుంచి ఉస్తాద్ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నాడని పలు మీడియా ఆర్టికల్స్ లో వార్తలు వచ్చాయి. అయితే వీటిలో నిజం లేదని తెలుస్తుంది. పవన్ తన నెక్స్ట్ కాల్ షీట్స్ OG కే ఇవ్వబోతున్నాడట. వచ్చే వారం నుంచి పవన్ వైజాగ్ లో వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నాడు. ఈ యాత్ర పూర్తి అయిన తరువాత OG సెట్స్ లోకి పవన్ అడుగుపెట్టనున్నాడు.
Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్‌లో హీరోయిన్‌గా..
సెప్టెంబర్ నెల మొదటి వారంలో పవన్ 10 రోజులు కాల్ షీట్స్ OG కి ఇవ్వనున్నాడు. ఈ షెడ్యూల్ తో పవన్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అవుతుందని తెలుస్తుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన పవన్ వర్కింగ్ స్టిల్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
