Pawan Kalyan Ustaad Bhagat Singh Shooting start Photo leaked from set
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు, ఓ పక్క సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే సంవత్స్సరమే ఎన్నికలు ఉండటంతో ఎక్కువగా పాలిటిక్స్ కి సమయం కేటాయిస్తున్నారు పవన్. దీంతో చేతిలో ఉన్న సినిమాలు షూటింగ్స్ లేట్ అవుతున్నాయి. ఇటీవలే బ్రో సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు పవన్. పవన్ చేతిలో ఇప్పుడు OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఎలక్షన్స్ లోపు ఈ సినిమా షూటింగ్స్ పూర్తిచేయాలని చూస్తున్నాడు పవన్.
OG సినిమాకి ఇంకొక షెడ్యూల్ డేట్స్ ఇస్తే షూట్ పూర్తవుతుంది. ఉస్తాద్, హరిహర సినిమాలు ఎప్పట్నుంచో వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇటీవల ఉస్తాద్ షూట్ మొదలవుతుంది, ఈ సంవత్సరం షూట్ అయిపోతుందని చిత్రయూనిట్ తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
పోలీస్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్, అతని క్లోజ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఇద్దరు సెట్స్ లో నడుస్తుండగా తీసిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. దాదాపు ఒక వారం రోజుల పాటు ఉస్తాద్ షూటింగ్ షెడ్యూల్ ఉండొచ్చని సమాచారం. హరీష్ శంకర్ కూడా చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక సెట్ లోనుంచి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటో బయటకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Swag king
||#UstaadBhagatSingh | #PawanKalyan|| pic.twitter.com/0Q2RacfmkD
— Manobala Vijayabalan (@ManobalaV) August 21, 2023