Ali: ‘ఆలీతో సరదాగా’ టాక్ షోకి పవన్ కళ్యాణ్ వస్తాడు.. ఆలీ కీలక వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ప్రధాన కధానాయకుడిగా తెరకెక్కిన సినిమా “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి”. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 28న డైరెక్ట్ ఓటిటిలో విడుదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో.. అలీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలీతో సరదాగా' షోకి పవన్ కళ్యాణ్ రాక గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
- gum 95921
- Updated on- November 1, 2022 / 06:48 AM IST
Pawan Kalyan will come to the talk show Alitho Saradaga
Ali: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ.. ప్రధాన కధానాయకుడిగా తెరకెక్కిన సినిమా “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి”. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 28న డైరెక్ట్ ఓటిటిలో విడుదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో.. అలీ తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోకి పవన్ కళ్యాణ్ రాక గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Ali: పవన్ మునుపటి రెండు సినిమాల్లో తన పాత్ర లేకపోవడం గల కారణాలని బయటపెట్టిన ఆలీ..
ఇండస్ట్రీలో పవన్, అలీ స్నేహం గురించి అందరకి తెలిసిందే. దీంతో పవన్ ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి ఎప్పుడు తీసుకువస్తున్నారు అని ప్రశ్నించగా, అలీ బదులిస్తూ.. పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడో అడిగా, అయన కూడా వస్తా అని మాట ఇచ్చారు. ఇప్పుడు అయన సినిమాలు, రాజకీయాలు వల్ల కొంచెం బిజీగా ఉంటున్నారు.
కానీ భవిషత్తు కాలంలో అయన నా షోకి కచ్చితంగా వస్తారు. కాగా ‘అలీతో సరదాగా’ మొత్తం కార్యక్రమంలో సినీ గాయకుడు దివంగత బాల సుబ్రహ్మణ్యం గారితో చేసిన ఎపిసోడ్ తనకు ఎంతగానో ఇష్టమని, అయన తనని కొడుకులా చూసుకునే వారని, అయన మరణించారని తెలిసి తట్టుకోలేకపోయానంటూ వెల్లడించాడు. అలాగే జగన్నాధ్, వి వి వినాయక్, అల్లు అరవింద్ తో చేసిన ఎపిసోడ్లు కూడా తన ఫేవరెట్ అని తెలిపాడు.
