Payal Rajput : హీరోగా వస్తున్న పాయల్ రాజ్ పుత్ బాయ్ ఫ్రెండ్.. ఫస్ట్ టైం అంటూ..
పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. (Saurabh Dhingra)
- Saketh U
- Updated on- May 20, 2026 / 03:03 PM IST
Payal Rajput Boy Friend Saurabh Dhingra Turned As Hero With First Time Movie
Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. పాయల్ రాజ్ పుత్ ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ ని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. పాయల్ తన బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
సౌరబ్ ధింగ్ర హీరోగా, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ హీరోగా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఫస్ట్ టైం’. హేమంత్ ఇప్పనపల్లి దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భారీగా విఎఫ్ఎక్స్ ఉండనుందని సమాచారం. ఫస్ట్ టైం సినిమా మే 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గెస్టులుగా హాజరయ్యారు.
Also See : Ntr Family Photos : నేడే ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
ఈవెంట్లో డైరెక్టర్ హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమాకు వెనుక ఉండి మాకు దైర్యం ఇచ్చిన వ్యక్తి పాయల్. అందరూ ఈ సినిమాను చుడాలని కోరుకుంటున్నాను అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్.. ఇలా చాలా పనులు ఒకరే చేయడం చాలా కష్టం. హేమంత్ ఇవన్నీ చేయడం గొప్ప విషయం. ఈ విశ్వంలో అందరికంటే పైన ఉండే బ్రహ్మ దేవున్ని చూపిస్తూ ఈ విశ్వాన్ని ఎలా ముందుకు నడిపిస్తారో చూపిస్తున్నట్లు ఉంది ఈ సినిమా అని అన్నారు.
నటుడు సౌరబ్ ధింగ్ర మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మా డైరెక్టర్ తమ కుటుంబానికి దూరంగా ఉండి ఎంతో కష్టపడ్డారు. నాకు ప్రతి విషయంలో అండగా నిలబడి నన్ను సపోర్ట్ చేస్తున్న పాయల్ కు కృతజ్ఞతలు. ఇంతకాలం నీ వల్ల నేను గర్వపడ్డాను, ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను అని అన్నారు. పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. డైరెక్టర్ హేమంత్ కి ఆల్ ది బెస్ట్. ఆయన ఈ సినిమా కోసం సర్వం పెట్టీ పని చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతారు. సౌరబ్ సినిమా అనేది ఒక ప్రతిజ్ఞలా తీసుకుని చేసాడు అని తెల్పింది.
