Tees Maar Khan: బీచ్ ఒడ్డున రొమాన్స్‌లో మునిగిన పాయల్, ఆది!
లవ్‌లీ హీరో ఆది సాయికుమార్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ..
- Naresh Mannam
- Updated on- October 28, 2021 / 06:00 PM IST
Tees Maar Khan
Tees Maar Khan: లవ్‌లీ హీరో ఆది సాయికుమార్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ గోగణ దర్శకత్వంలో తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న ఆది ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ తో బీచ్ లో రొమాన్స్ లో మునిగితేలుతున్నాడు. ఇప్పుడు పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Mehreen Pirzada: ముచ్చెమటలు పుట్టించే మెరుపుతీగ మెహ్రీన్!
ఆది, పాయల్ కలిసి నటిస్తున్న తీస్ మార్ ఖాన్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇప్పుడు గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ హాట్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో ఆది, పాయల్ ఇద్దరూ రెచ్చిపోయి నటించినట్లు ఫొటోలను చూస్తుంటేనే అర్థమవుతుంది. గోవా బీచ్ సముద్ర తీరంలో షర్ట్ విప్పేసి అలా పడుకున్న ఆది సాయికుమార్ గుండెలను పాయల్ తన పాదంతో తాకుతున్న ఫోటో బయటకొచ్చింది.
Puri Jagannadh: పూరి కూతురు హీరోయిన్.. ఆకాష్ ఏం చెప్పాడంటే?
ఇక, మరో ఫొటోలో ఇద్దరూ తన్మయత్వంలో మునిగిపోయి దగ్గరగా కూర్చున్నారు. ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ సినిమాలో ఇంటెన్సిటీ లవ్ కూడా ఉండదనుందని.. ఇందులో ఈ జంట రెచ్చిపోయి నటించిందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అందాల విందు పెట్టడంలో ఎప్పుడూ ముందుండే పాయల్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకోగా ఆది కూడా టైటిల్ కు తగ్గట్లే నిరూపించుకోవాలని ఆరాటంలో ఉన్నాడు. మరి ఈ సినిమా అయినా ఈ ఇద్దరికీ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.
