Peddi Collections 6 Days: పెద్ది ఆరు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది బాక్సాఫీస్ (Peddi Collections) వద్ద దూసుకుపోతుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 10, 2026 / 02:32 PM IST
Peddi 6 days Collections do you how much to break even
Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ వచ్చింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను పంచుకుంది.
రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు నిర్మించారు.
*Shiva Jyothi : భారీ హారంతో శివజ్యోతి.. ఎరుపు రంగు చీరలో స్టన్నింగ్ ఫోటోలు..
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమాకు దాదాపు 218.50 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 220 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే కనీసం 440 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు 332 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంటే ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాంటే మరో 108 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది.
*Anchor Sravanthi : తెలుపు చీరలో తెలుగు అందం.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మిగిలిన చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో మిగిలిన చోట్ల కూడా బ్రేక్ ఈవెన్‌ను సాధించే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
#Peddi collects a gross of over 332.1 CRORES WORLDWIDE in 6 days ❤🔥
BOX OFFICE CHAMPION reigning at the top 💥💥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/24pqa47vNG
— PEDDI (@PeddiMovieOffl) June 10, 2026
