Buchibabu Sana : బుచ్చిబాబుది ఎంత మంచి మనసో.. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో..

ఇప్పుడు బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. (Buchibabu Sana)

  • Updated on- June 5, 2026 / 08:24 PM IST

Buchibabu Sana

Buchibabu Sana : ఎన్నో ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమా ఏకంగా రామ చరణ్ తో పెద్ది తీసి మరింత ఘన విజయం సాధించారు. ఇప్పుడు బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

బుచ్చిబాబు సానది పిఠాపురం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే పిఠాపురం ఓ పుణ్యక్షేత్రం కూడా. కుక్కుటేశ్వర ఆలయం, శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయాలు ఉండటంతో పిఠాపురంకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. బుచ్చిబాబు కూడా అనేక సందర్భాల్లో పిఠాపురం గురించి, అక్కడి ఆలయాల గురించి మాట్లాడారు.

Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’లో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా..?

పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను చేస్తున్న ఓ మంచి పని గురించి చెప్పాడు. బుచ్చిబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక హోటల్ లాటింది కడుతున్నాను. అందులో కొన్ని రూమ్స్ అక్కడికి వచ్చే భక్తులకు ఫ్రీగా ఇస్తాను. అలాగే ఆ హోటల్ మీద వచ్చే డబ్బులో కొంత బాగా చదువుకునే పేద పిల్లలకు సహాయంగా ఇద్దామనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో బుచ్చిబాబు మంచి మనుసుని అభినందిస్తున్నారు.