మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్

ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.

  • Publish Date - April 10, 2019 / 09:51 AM IST

ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.

ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. సినిమా విడుదల నిలిపివేయాలంటు ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది.  దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సినిమా విడుదల నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా ఈసీ ఉత్తర్వులతో రిలీజ్ నిలిచిపోయింది. ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినస్టర్ కు, సీబీఎఫ్ సీ బోర్డుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Also : భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ

 కాగా లోక్ సభ ఎన్నికల సమయంలో పీఎం నరేంద్ర మోడీ సినిమా విడుదల నిలిపివేయాలంటు కాంగ్రెస్  సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దీనిపై తాము స్పందించలేమనీ ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ కు సంబంధించిన విషమని తేల్చిచెప్పింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని చిత్ర యూనిట్ భావించింది. కానీ తాజాగా ఈసీ సినిమా విడుదల నిలిపివేయాలంటు ఈసీ ఉత్తర్వులతో చిత్ర యూనిట్ మండిపడుతోంది. రాజకీయ కథాంశంతో వచ్చిన సినిమా కాబట్టి ఓటర్లపై ఈ ప్రభావం ఉంటుందని భావించిన ఎన్నికల కమిషన్ సినిమా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం కూడా తెలిసిందే.  

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన ‘పీఎం నరేంద్ర మోడీ’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రల్లో నటించారు. 
Read Also : KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..