Varshini Venkat : బిగ్ బాస్ వర్షిణి అరెస్ట్..

బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి వ‌ర్షిణి వెంక‌ట్‌ను (Varshini Venkat) పోలీసులు అరెస్ట్ చేశారు.

Police arrested Tamil bigg boss fame Varshini Venkat for cheating

బిగ్‌బాస్ ఫేమ్‌, న‌టి వ‌ర్షిణి వెంక‌ట్‌ను (Varshini Venkat) పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్య‌క్తిని బెదిరించి న‌గ‌దు, సెల్‌ఫోన్‌ను దోచుకున్న కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

షార్ట్‌ఫిల్మ్ నిర్మిస్తానని చెప్పడంతో ఓ వ్య‌క్తి.. వర్షిణికి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఆ త‌రువాత త‌న‌ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ వ్య‌క్తి అడిగాడు. దీంతో ఆగ‌స్టు 22న స‌ద‌రు వ్య‌క్తిని పిలిపించి దాడి చేసి రెండు సెల్ ఫోన్లు, 50 వేల న‌గ‌దు ఆమె లాక్కొన్న‌ట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆ త‌రువాత ఫోన్ చేసి మ‌రో 5 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లు పేర్కొన్నాడు. అడిగిన‌ట్లు 27 ల‌క్ష‌లు ఇవ్వ‌క‌పోతే అబ‌ద్ద‌పు కేసు పెడ‌తాన‌ని ఆమె బెదిరించిన‌ట్లు అత‌డు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Bigg Boss Today Promo : క‌న్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ‌.. బిగ్‌బాస్ ప్రొమో వైర‌ల్..

ఈ ఘటనపై పోలీసులు వర్షిణి వెంకట్‌తో పాటు మరో ముగ్గురిపై మోసం, దోపిడీ/లాక్కోవడం తదితర ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వర్షిణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక వ‌ర్షిణి విష‌యానికి వ‌స్తే.. ఆమె రెండేళ్ల క్రితం త‌మిళ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. లారా, సొట్ట సొట్ట న‌నైతు చిత్రాల్లో న‌టించింది.