Pooja Hegde : ఆఫ్ స్క్రీన్.. ఏమన్నా కష్ట పడుతున్నారా..!
పూజా హెగ్డే, విజయ్ తో నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.. యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’బ్బింగ్ పూర్తి చేశారు..
- sekhar
- Updated on- June 26, 2021 / 04:13 PM IST
Pooja Hegde Sudheer Babu
Pooja Hegde: దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న 65వ సినిమా ‘బీస్ట్’.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ పిక్చర్ నిర్మిస్తోంది.
Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..
హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఫస్ట్ టైం విజయ్ పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి డ్యాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేసినట్లు పూజా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ అయిన ‘బీస్ట్’ కొత్త షెడ్యూల్ కొద్ది రోజుల్లో స్టార్ కానుంది.
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’.. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర’ విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.. ‘పలాస 1978’ తో సినిమా వర్గాలవారిని, ప్రేక్షకులను ఆకట్టుకున్న కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
Sridevi Soda Center : లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు..
ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ డబ్బింగ్ కంప్లీట్ చేసినట్లు సుధీర్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఓ ఫైట్ సీన్‌కు అదిరిపోయేలా డబ్బింగ్ చెప్తున్న వీడియోను షేర్ చేశారు సుధీర్ బాబు.. త్వరలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుంది.
