×
Ad

Pooja Hegde : నిజంగా అతను పూజ హెగ్డే బాయ్ ఫ్రెండేనా? ఎవరీ రోహన్ మెహ్రా..?

పూజ హెగ్డే గతంలో ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని ఎక్కువగా వార్తలు రాలేదు. కానీ మొదటి సారి పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతనే అని తెగ వైరల్ అవుతుంది.

  • Published On : April 1, 2024 / 09:21 AM IST

Pooja Hegde Rumour Boy Friend Rohan Mehra Video goes Viral in Bollywood

Pooja Hegde : బుట్టబొమ్మ పూజ హెగ్డే తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుసగా స్టార్ హీరోల సినిమా ఛాన్సులు వస్తుంటే సడెన్ గా బాలీవుడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ చేతిలో ఉన్న కొన్ని స్టార్ హీరోల సినిమాలు వదిలేయడంతో బాలీవుడ్ కోసమే అని రూమర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మొన్నటిదాకా ఖాళీగా ఉంది. ఇటీవలే ఓ రెండు బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చినట్టు సమాచారం.

ఇక పూజ హెగ్డే గతంలో ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని ఎక్కువగా వార్తలు రాలేదు. కానీ మొదటి సారి పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతనే అని తెగ వైరల్ అవుతుంది. ముంబైలో పూజా హెగ్డే మరో బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో(Rohan Mehra) కలిసి కార్ లో కనపడింది. ఓ ప్రైవేట్ పార్టీకి వచ్చి వెళ్తున్నట్టు సమాచారం. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా అని బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తుంది.

Also Read : Vijay Deverakonda : నెగిటివిటి ఫేస్ చేయలేకపోతే ఇంటికెళ్ళిపో.. దేవుడ్ని, మోదీని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు..

ఇంతకీ పూజ హెగ్డేతో కనపడిన ఆ నటుడు రోహన్ మెహ్రా.. బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా మారాడు. బజార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు వెబ్ సిరీస్ లలోను నటించాడు. ఇతని పూర్తి పేరు రోహన్ వినోద్ మెహ్రా. అంతగా పాపులర్ నటుడు కూడా కాదు. అతనితో పూజ హెగ్దే ప్రేమలో ఉందని ఇప్పుడు వార్తలు రావడం వైరల్ గా మారింది.

మరి అతను నిజంగానే బాయ్ ఫ్రెండా? లేక ఆ పార్టీలో కలుసుకొని ఒకే కార్ లో వెళ్ళారా? లేక జస్ట్ ఫ్రెండా? అనేది పూజాకే తెలియాలి. ఇటీవల చాలా మంది హీరోయిన్స్ తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెట్టేస్తున్నారు. మరి పూజ హెగ్డే కూడా తన ప్రేమ విషయం బయటపెడుతుందేమో చూడాలి. ఇప్పుడు ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయినా ఆ వీడియో చూసి అభిమానులు, నెటిజన్లు పూజా అతనితో ప్రేమలో ఉందనే అనుకుంటున్నారు.