×
Ad

Prabhas : అయ్యో పాపం.. ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని మోసం చేస్తున్న ప్రభాస్.. పూజాహెగ్డే కామెంట్స్ వైరల్..

తాజాగా పూజాహెగ్డే బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడింది. (Prabhas)

  • Published On : February 18, 2026 / 03:53 PM IST

Prabhas

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాజాసాబ్ సినిమాతో రాగా త్వరలో ఫౌజీ సినిమాతో రాబోతున్నాడు. ప్రభాస్ బయట ఎక్కువ కనపడడు, మీడియాకు దూరంగా ఉంటాడు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడు అని తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి హీరోయిన్ పూజాహెగ్డే ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ప్రభాస్ – పూజాహెగ్డే రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటించారు. తాజాగా పూజాహెగ్డే బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడింది.

Also See : Chiranjeevi : భార్య పుట్టిన రోజు.. స్పెషల్ పాత ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

పూజ హెగ్డే మాట్లాడుతూ..ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండడు. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అతను పట్టించుకోడు. ఒకసారి అతను సోషల్ మీడియా మొత్తానికి వదిలేద్దామని అనుకున్నాని చెప్పాడు. అయినా అతని సోషల్ మీడియా అకౌంట్ అతని టీమ్ మేనేజ్ చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ కి, ఏదైనా ప్రకటించడానికి ప్రభాస్ టీమ్ అతని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అని తెలిపింది.

సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియాలో వాళ్ళ టీమ్స్ మేనేజ్ చేస్తాయని తెలుసు కానీ అన్ని వాళ్ళు పోస్ట్ చేయరు. సెలబ్రిటీలు కూడా స్వయంగా పోస్టులు, ఫోటోలు షేర్ చేయడం లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ విషయంలో మాత్రం మొత్తం అతని టీమ్ చూసుకుంటుందని చెప్పేసింది. ప్రభాస్ తన సోషల్ మీడియాలో సినిమాల పోస్టులు, వేరే సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పడం, సక్సెస్ అయిన సినిమాకు కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకా ఎలాంటి పోస్టులు పెట్టడు. అవి స్వయంగా ప్రభాస్ పెట్టడనుకొని నమ్మి వాటికి కొంతమంది ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతారు.

ఫ్యాన్స్ ఏమో ప్రభాస్ ఫలానా సినిమా గురించి పోస్ట్ చేసాడని అనుకుంటారు. కానీ అవి పెట్టేది ప్రభాస్ టీమ్. అసలు ప్రభాస్ కి వాటి గురించి తెలుసో లేదో కూడా సందేహమే. దీంతో ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని ప్రభాస్ భలే మోసం చేశాడ్రా అని అనుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ అయితే సోషల్ మీడియా వాడడు, అతని పేరు మీద అతని టీమ్ ఆ అకౌంట్స్ ని మేనేజ్ చేస్తుందని పూజాహెగ్డే చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ గామారాయి.

Also Reda : TollyWood : టాలీవుడ్‌లో ఏఐ పంచాయితీ..!