భర్తపై Poonam Pandey కంప్లైంట్, సామ్ అరెస్టు

  • Publish Date - September 23, 2020 / 09:45 AM IST

Poonam and Sam  : తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడు..బెదిరిస్తున్నాడు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి పూనం పాండే. ఈ నెల 01వ తేదీన సామ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు …సామ్ ను బాంబేను గోవా పోలీసులు అరెస్టు చేశారు.



సాం బాంబే తనను వేధిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పూనం పాండే సోమవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు, అతడిని అరెస్ట్‌ చేశామని కనకోనా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తుకారాం చవాన్‌ తెలిపారు.
కేసు నమోదు చేసి బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.



ఏదో ఒక వివాదంతో ఈమె వార్తల్లో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫొటోలతో యువతను కిక్కెంచిన ఈ భామ..మోడల్ నుంచి నటిగా ఎదిగింది. పూనమ్‌ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చేసింది తక్కువ సినిమాలైనా..వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందారు.



ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం సంచలనం రేకేత్తించింది.

ట్రెండింగ్ వార్తలు