Poorvaaj : కోటి రూపాయల కాంటెస్ట్ నిజమే.. జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్’ సినిమాపై దర్శకుడు..

ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు, నటుడు పూర్వాజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Poorvaaj)

  • Published on- October 27, 2026 / 04:50 PM IST

Poorvaaj

Poorvaaj : జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పణలో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మాణంలో పూర్వాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కిల్లర్ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు, నటుడు పూర్వాజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన జ్యోతి పూర్వజ్ గురించి మాట్లాడుతూ.. జ్యోతి సీరియల్స్ తో జనాలకు దగ్గరయింది. ఆమె మీద ఉన్న అభిప్రాయాన్ని ఈ సినిమాతో పూర్తిగా మార్చాలి. ఆమె ఇందులో యాక్షన్స్ చేసారు. కాలికి గాయాలు కూడా అయ్యాయి. ఆరు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. అందంగా కనపడాలి. దాని కోసం చాలా వర్క్ చేసింది. ప్రతి పాత్రకు తగట్టు మేకోవర్ అయ్యారు. ఆమెని కొత్తగా చూస్తారు ప్రేక్షకులు అని తెలిపారు.

Also Read : Cyclone Arnab : ‘అర్నబ్’ తుఫాను ఎఫెక్ట్.. మూతపడ్డ థియేటర్లు.. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే..

కిల్లర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రిచ్ కంటెంట్ ఉంది. సెన్సార్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. మా సినిమాలో బ్లడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి. ఈ మూవీలో టెర్రరిస్ట్ పాత్ర పది నిమిషాలు కనిపిస్తుంది. మళ్లీ కనిపించదు. స్పై, వాంపైర్ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ చేశాక కూడా మా సినిమా స్టోరీ ఎవరికీ అందడం లేదు. అది సినిమాలోనే చూడాలి. న్యూరోలింక్ మీద ఎలాన్ మస్క్ పరిశోధనలు చేస్తున్నాడు. అతను మిషిన్స్ మీద చేస్తున్నాడు. మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మా సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాను ఇరవై ఐదు రోజుల్లోనే చిత్రీకరించాను. కాకపోతే VFX కి చాలా సమయం పట్టింది. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా. మా సినిమా టీమ్ కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్ కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్ ను మార్పులు చేసి కిల్లర్ సినిమా తీసాను. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారని తెలిపారు.

ఈ సినిమాలో దర్శకత్వం, నిర్మాత, నటుడిగా నిర్వహించిన బాధ్యతల గురించి చెప్తూ.. ఏ పని చేస్తున్నప్పుడు ఆ బాధ్యతనే నిర్వర్తించాను. పరిశ్రమలో నాకున్న అనుభవం ఈ మూడు రోల్స్ ప్లే చేసేలా ఉపయోగపడ్డాయి. ఇంకో ఆరేడు క్రాఫ్ట్స్ డీల్ చేయాలన్నా చేస్తాను. అది సినిమా మేకింగ్ మీద నాకున్న ప్యాషన్. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఇందులో ఒక పాత్ర చేయాలి అనిపించింది. ఈ సినిమాలో నా పాత్రకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి అని తెలిపారు.

Also Read : Vishwak Sen : నాకు ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా అలాంటి రోల్స్ చేయను.. విశ్వక్ సేన్ కామెంట్స్..

ఈ సినిమా కాంటెస్ట్ గురించి మాట్లాడుతూ.. మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకుంటారు. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా ఉంటారు అందులో. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేసి వాళ్లకు ఆ కోటి రూపాయలు ఇస్తాం. మా బడ్జెట్ ఐదు కోట్లు అయింది. ప్రమోషన్స్ కి బడ్జెట్ పెట్టె బదులు మేము కోటి రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేయడం జనాల్లోకి మా సినిమా విపరీతంగా వెళ్లిపోయింది అని తెలిపారు.

రిలీజ్ డేట్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. మేము మొదట అక్టోబర్ 9 నే వద్దామనుకున్నాం కానీ ఆదర్శకుటుంబం వస్తుంది అన్నారు కానీ రాలేదు. ఇప్పుడు అక్టోబర్ 30 డేట్ వేస్తే ఇప్పుడు వస్తుంది ఆ సినిమా. అయినా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. నా సినిమాలు రిలీజైనప్పుడు ఏదో ఒక ప్రకృతి విపత్తు వస్తూనే ఉంది. శుక్ర టైమ్ లో కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ చేశారు. ఓటీటీలో బాగా సక్సెస్ అయింది ఆ సినిమా. మాటరాని మౌనమిది కూడా ఓటీటీలో ఆదరణ పొందింది. ఇప్పుడు కిల్లర్ రిలీజ్ అవుతున్నప్పుడు అర్నాబ్ అని తుఫాన్ లు వస్తున్నాయి. ఏది అయితే అది అయ్యింది అని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.