Prabhas : దీపికా పదుకొనే గురించి ప్రభాస్ ఇంటెర్నేషనల్ మీడియాతో ఏం చెప్పాడో తెలుసా?

తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ప్రభాస్ కల్కి 2898 AD సినిమా గురించి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో దీపికా పదుకొనే(Deepika Padukone) గురించి మాట్లాడాడు.

Prabhas comments on Deepika Padukone in International Media Interview for kalki 2898 AD

Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. గతంలో పలు హాలీవుడ్(Hollywood) సినిమాల్లో కూడా మెరిపించింది. ఇక దీపికా ప్రభాస్ సరసన కల్కి 2898 AD సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ హాజరయ్యారు కానీ దీపికా రాలేదు.

తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ప్రభాస్ కల్కి 2898 AD సినిమా గురించి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో దీపికా పదుకొనే గురించి మాట్లాడాడు.

Comic Con 2023 : ‘ప్రాజెక్ట్ K’ టు ‘కల్కి 2898 AD’ కామిక్ కాన్ జర్నీ వీడియో చూశారా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం..

ప్రభాస్ మాట్లాడుతూ.. దీపికా చాలా పెద్ద సూపర్ స్టార్. చాలా అందమైన అమ్మాయి, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటెర్నేషనల్ బ్రాండ్స్ కి యాడ్స్ చేసింది, అంబాసిడర్ గా కూడా ఉంది. సెట్ కి దీపికా వచ్చినప్పుడు అందరికి ఉత్సాహం వస్తుంది. తనతో ఎప్పట్నుంచో వర్క్ చేయాలనుకున్నాను. ఆమెతో ఇదే మొదటిసారి వర్క్ చేస్తున్నాను. ఆమెని నటిగా చాలా ఇష్టపడతాను అని తెలిపాడు. దీంతో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపికా అభిమానులు ప్రభాస్ వ్యాఖ్యలని మరింత వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు