Prabhas Movies : ప్రభాస్ ప్రతి సినిమా వాయిదానే.. బాహుబలి నుంచి ఇదే తీరు..

ఈమధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని ధియటర్లోకి వచ్చిందే.

Prabhas every Movie postponed from Bahubali Time Now Salaar and Kalki also Postponed

Prabhas Movies : రెబల్ స్టార్ ప్రభాస్ కాస్తా పోస్ట్ పోన్ ప్రభాస్ అయిపోయాడంటున్నారు జనాలు. ఈమధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని ధియటర్లోకి వచ్చిందే. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోందని, ప్రభాస్ సినిమాలన్నీ మళ్లీ డిలే అవుతున్నాయని డిజప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న సలార్(Salaar) సినిమా వాయిదా పడింది. ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్లో ఈ నెల 28న రిలీజ్ కావల్సిన సలార్ పోస్ట్ పోన్ అయ్యింది. సలార్ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా ప్రమోషన్లు స్టార్ట్ చెయ్యకపోవడం, బుకింగ్స్ ఆపెయ్యడం.. ఈ కంప్లీట్ సినారియో చూస్తే సలార్ పోస్ట్ పోన్ అయినట్టే అని క్లియర్ గా తెలుస్తోంది. అయితే ప్రభాస్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ లాంటి మాసివ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సెప్టెంబర్ 28నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే కొంతమంది నవంబర్ లో రిలీజ్ అంటుంటే మరికొంతమంది ఏకంగా జనవరికే రిలీజ్ అంటున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో పాటు కల్కి కూడా పోస్ట్ పోన్ అయినట్టే తెలుస్తోంది. ఎందుకంటే కల్కి జనవరి రిలీజ్ అని గతంలో చెప్పినా లేటెస్ట్ గా రిలీజ్ డేట్ మారిందంటూ గట్టిగా రూమర్స్ తో పాటు టీమ్ కూడా రిలీజ్ క్లారిటీ ఇవ్వకపోవడంతో కల్కి కూడా రిలీజ్ వాయిదా వేసుకుందని తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాలు వాయిదా పడటం కొత్తేం కాదు. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ ప్రతీ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. బాహుబలి సినిమాలు కూడా అనుకున్న టైంకి రాకుండా రాజమౌళి చాలా అసార్లు వాయిదా అవేసి రిలీజ్ చేశాడు. ప్రభాస్ రీసెంట్ మూవీ ఆదిపురుష్ కూడా 2, 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన ఆదిపురుష్ ఈ సంవత్సరం జనవరికి, జనవరి నుంచి జూన్ కి వాయిదా పడి రిలీజ్ అయ్యింది.

అంతకుముందు రిలీజ్ అయిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ కూడా 2, 3 డేట్లు మార్చుకుని ధియేటర్లోకొచ్చింది. 2020 జనవరిలో షూట్ స్టార్ట్ చేసిన రాధేశ్యామ్ 2020 డిసెంబర్ లో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. అప్పటినుంచి కోవిడ్ తో పోస్ట్ పోన్ అవుతూనే వచ్చిన రాదేశ్యామ్ 2022 జనవరి నుంచి మరోసారి వాయిదా పడి మార్చి 2022 లో రిలీజ్ అయ్యింది.

రాథేశ్యామ్ కంటే ముందొచ్చిన సాహో పరిస్తితి కూడా అంతే. సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో కలిసి చేసిన స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో కూడా పోస్ట్ పోన్ అయ్యింది. రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ భారీ సినిమా ఒకసారి వాయిదా పడి ఆగస్ట్ 2019న రిలీజ్ అయ్యింది.

Skanda : ‘సలార్’ తప్పుకోగానే ‘స్కంద’ కూడా వచ్చేశాడు.. రామ్ స్కంద కొత్త రిలీజ్ డేట్ ఇదే..

ఇలా వరసగా ప్రభాస్ సినిమాలన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. బాహుబలి సినిమా నుంచి దాదాపు గత 7 ఏళ్ల నుంచి ప్రభాస్ ప్రతి సినిమా పోస్ట్ పోన్ అయ్యే ధియేటర్లోకి వస్తోంది. ఇప్పుడు కూడా సలార్, కల్కి తో పాటు నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ అంటున్న మారుతి సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇలా వరసగా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యేసరికి ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు