Prabhas Fan : ఇదెక్కడి మాస్ రా మామ.. ‘మిర్చి’ టికెట్స్ దొరకలేదని థియేటర్‌నే కొనేసి ప్రభాస్ ఫ్యాన్.. ఇప్పుడు నిర్మాతగా..
ఈ సినిమా ప్రమోషన్స్ లో కాండ్రేగుల నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Prabhas Fan)
- Saketh U
- Published on- October 1, 2026 / 10:00 AM IST
Prabhas Fan
Prabhas Fan : మన హీరోలకు అభిమానులే కాదు వీర భక్తులు ఉంటారని తెలిసిందే. తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఎంతకైనా ఖర్చుపెడతారు, కష్టపడతారు. అలా తన ఫేవరేట్ హీరో సినిమా చూడలేకపోయానని ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ గా మారింది.
అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు ఇప్పుడు నిర్మాతగా మారి అనకాపల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాండ్రేగుల నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Dhanush : పూర్తిగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న ధనుష్.. సూర్య, కార్తీల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ కోసం..
కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. నేను మాములుగా ప్రభాస్ ఫ్యాన్ ని. ఏ సినిమా అయినా చూస్తాను. ప్రభాస్ సినిమా అయితే ఫ్యామిలీ అంతా వెళ్తాము. మిర్చి సినిమా రోజు ఫ్యామిలీ తో సినిమాకు వెళ్ళాము. కానీ టికెట్స్ లేవు. ఫుల్ బిజీగా ఉంది థియేటర్. చాలా సేపు రిక్వెస్ట్ చేశాను టికెట్స్ కోసం. చాలా సేపు మధ్యాహ్నం అంతా నించున్నాను. అయినా ఇవ్వలేదు టికెట్స్. ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకొని మొదలు పెట్టాను. ఎప్పటికైనా ఆ థియేటర్ ని కొనాలి అనుకున్నాను. ఆ తర్వాత అదే థియేటర్ ని నేను కొన్నాను. అనకాపల్లి వెంకటేశ్వర థియేటర్ అది. ఇప్పుడు నేను నిర్మించిన అనకాపల్లి సినిమాని ఆ థియేటర్ లో కూడా రిలీజ్ చేస్తున్నాను అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇదెక్కడి పీక్ ఫ్యానిజం అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
Idhekkadi Mass ra 🙏💥💥💥#Mirchi movie ticket dhorakaledhani adhe Theatre koneyyadam 🫡🫡🫡🫡
Ayyaaaa meere inka maa inspiration 🙏 pic.twitter.com/0XaI6zCldO
— IVD PRABHAS (@ivdsai) September 29, 2026
నేను ప్రభాస్ ఫ్యాన్‌ని..
ప్రభాస్ సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తాం
‘మిర్చి’ సినిమా రోజున టికెట్లు దొరకలేదు.
ఆ రోజే అనుకున్నా.. ఇకపై ఒక్కసారి కూడా ఇలా కాకూడదని. అందుకే ఆ తర్వాత ఆ థియేటర్‌నే తీసుకున్నా. pic.twitter.com/rslua8aYV0
— greatandhra (@greatandhranews) September 30, 2026
