×
Ad

Buchibabu Sana : పెద్ది రిలీజ్ అవ్వకుండానే.. బుచ్చిబాబుకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడా?

పెద్ది రిలీజ్ అవ్వకుండానే బుచ్చిబాబుకి ప్రభాస్ నుంచి ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. (Buchibabu Sana)

  • Published On : February 25, 2026 / 08:28 PM IST

Buchibabu Sana

Buchibabu Sana : మొదటి సినిమా ఉప్పెనతో భారీ హిట్ కొట్టి సుకుమార్ శిష్యుడు అనిపించుకుని ఒక్కసారిగా సినీ పరిశ్రమలో స్టార్ అయ్యాడు. రెండో సినిమాకు కాస్త టైం పట్టినా ఏకంగా రామ్ చరణ్ తో పెద్ది లాంటి భారీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పెద్ది రిలీజ్ అవ్వకుండానే బుచ్చిబాబుకి ప్రభాస్ నుంచి ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, కల్కి-2, ఫౌజీ, సలార్-2 లాంటి సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అయితే డార్లింగ్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ది రాజాసాబ్ ఫ్లాప్ అవ్వటంతో ఆ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.

Also See : Srinidhi Shetty : చీరకట్టులో మేకప్ లేకుండా.. శ్రీనిధి శెట్టి క్యూట్ పోజులు..

ఈ ప్రాజెక్ట్‌ను 2027లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రభాస్ హీరోగా టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా చేయబోయే సినిమాకు డైరెక్టర్‌గా బుచ్చిబాబు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తున్న పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్‌ అవుతుంది. అది అయిపోగానే బుచ్చిబాబు ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడంటున్నారు.

మరి ప్రభాస్ బుచ్చిబాబు కాంబో ఎలా ఉండబోతుందో.? ఎలాంటి జోనర్ అనేది సస్పెన్స్‌గా మారింది. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ అంటున్నారు. పీపుల్ మీడియా ప్యాక్టరీలో ప్రభాస్ మరోసారి చెయ్యబోతున్న సినిమా కావటంతో ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభాస్‌ బుచ్చిబాబు కాంబో నిజమేనా లేక మరో డైరెక్టర్‌తో సినిమా ఉంటుందా అనేది తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

Also See : Nayan Sarika : చీరకట్టులో నయన్ సారిక.. విష్ణు విన్యాసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్యూట్ పోజులు..